Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

కరుణ లేనిచోట హింసకు బీజం పడుతుంది

ఆషికీ’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి అను అగర్వాల్, తన జీవితంలోని ఓ ముఖ్యమైన విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనను మానసికంగా నయం చేయడంలో ‘కరుణ’ కీలక పాత్ర పోషించిందని ఆమె తెలిపారు. మరేదీ ఇవ్వలేని బలాన్ని, స్పష్టతను కరుణ తనకు అందించిందని తాజాగా ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.తన ఫౌండేషన్‌ను ప్రారంభించినప్పుడు కరుణనే ప్రధాన సూత్రంగా పెట్టుకున్నానని అను అగర్వాల్ వివరించారు. “ప్రపంచంలో కరుణ లేనప్పుడు ‘నేను-వాళ్లు’ అనే విభజన మొదలవుతుంది. అక్కడే హింసకు బీజం పడుతుంది. యుద్ధాలు పుడతాయి. కానీ, నా ఫౌండేషన్‌లో కరుణనే నా కార్యాచరణ అయింది. దాంతో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ ప్రేమే తిరిగి వచ్చి, నన్ను అద్భుతంగా నయం చేసింది. కరుణతో నిండిన ప్రపంచమే శాంతియుతమైన ప్రపంచం” అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Related posts

నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది

TNR NEWS

మహేష్ మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూన‌రేష‌న్ ఎంత‌…?

TNR NEWS

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు ‘అర్జున’ టైటిల్!

TNR NEWS

రాజమౌళికి మద్దతుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ

TNR NEWS

ఆ సమయంలో ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చాము

TNR NEWS

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నేటితో 50రోజులు పూర్తి

TNR NEWS