Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది

మెగా డాటర్ నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ మద్రాస్ కారన్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. మద్రాస్ కారన్ ఈ నెల 10న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. షేన్ నిగమ్ హీరోగా, వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బి.జగదీశ్ నిర్మించారు.సంక్రాంతి కానుకగా విడుదలైన మద్రాస్ కారన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. మద్రాస్ కారన్ తమిళ్ వెర్షన్ ను ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆహా అధికారికంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

త్వరలో విడుదల కానున్న ‘సర్దార్ 2’ టీజర్

TNR NEWS

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నేటితో 50రోజులు పూర్తి

TNR NEWS

రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న ‘వీర ధీర శూరన్‌’

TNR NEWS

‘డ్రాగన్’ సినిమాను మహేశ్ బాబు చూడాలని కోరుకుంటున్నా

TNR NEWS

చిత్రసీమలో నాకంటూ చిన్న స్థానం ఏర్పరచుకోవాలన్నది నా పెద్ద కోరిక