Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బాల్య వివాహలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు జిల్లా సంక్షేమ అధికారి కే. నర్సింహారావు

స్థానిక చివ్వేంల మండల పరిధిలోని మున్యానాయక్ తండా నందు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమo నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి కే. నరసింహరావు గారు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం లో భాగంగా బాల్యవివాహలపై అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించి, మన రాష్ట్రాన్ని అదేవిధంగా మన సూర్యాపేట జిల్లాని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా, జిల్లాగా మార్చడం మనందరి బాధ్యత అన్నారు.

బాల్య వివాహాలు ఒక సామాజిక రుగ్మత.

చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల బాలికలు వారి చిన్నతనాన్ని, చదువును కోల్పోతున్నారు. శారీరకంగా, మానసికంగా ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో, తల్లులుగా మారినప్పుడు వారు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది వారి భవిష్యత్తును మాత్రమే కాదు, మొత్తం సమాజ పురోగతిని కూడా అడ్డుకుంటుంది.

మన తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది.

బాల్య వివాహాలను నిషేధిస్తూ చట్టాలు ఉన్నాయి అన్నారు అదేవిధంగా ఐసీపీఎస్, చైల్డ్ హెల్ప్ లైన, పోలీసులు సభ్యులుగా కలిసి ఎప్పటికప్పుడు బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. మీ చుట్టుపక్కల ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే వెంటనే చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కీ కాని 100 నెంబర్ కీ కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపరవైజర్ మంగతాయమ్మ జిల్లా బాలల రక్షణ అధికారి రవి మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ చైతన్య చివ్వేంల పీహెచ్సి డాక్టర్ భవాని, ఐసీపీఎస్ నాగరాజు, జెండర్ స్పెషలిస్ట్ వినోద్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు..

Related posts

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS

వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS

ఆచార్య చింతకింది సద్గుణకి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు’

TNR NEWS

ఐఎంఏ అధ్యక్షులు గంగాసాగర్ కు సన్మానం 

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS

పెన్షనర్స్ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS