సిర్పూర్ నియోజకవర్గం.
బెజ్జూర్ మండలంలోని కుంటలమానెపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబుఅభినందించారు.
అనంతరం కబడ్డీ పోటీలలో గెలుపొందిన అందవెల్లి టీం కు మరియు రన్నర్స్ అప్ గా నిలిచిన కమ్మర్గాం టీంకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
బెజ్జూర్ మండలంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి క్రీడ ప్రాంగణంగా అభివృద్ధి చేస్తామని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబుహామీ యిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కోండ్ర మనోహర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ తేలే బాపు, మాజీ సర్పంచ్లు వెంకటేష్, వసీ ఉల్లఖాన్, గూడ రాకేష్, చాకటి విజయ్, తుకారాం, రాజారాం, జాడి దిగంబర్, భిక్షపతి, పాపయ్య, తిరుపతి, మురళీ, మధుకర్, బాలకృష్ణ, సంతోష్, పురుషోత్తం, పవన్, మోహన్, రమేష్, రామయ్య, చాకటి హన్మంతు, కోరేత హన్మంతు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.