నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ 2’పై అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. జర్మనీకి చెందిన ఓ ఎన్ఆర్ఐ అభిమాని ఈ సినిమా టికెట్‌ను ఏకంగా రూ. 2 లక్షలు పెట్టి కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.’అఖండ 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో నివసించే రాజశేఖర పర్ణపల్లి అనే బాలయ్య వీరాభిమాని, తన అభిమాన హీరో సినిమా కోసం ఏకంగా రూ. 2,00,000 చెల్లించి ఒక టికెట్‌ను దక్కించుకున్నారు.
