Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

చిరుతో డ్యాన్స్ చేయ‌డం నాకు జీవితాంతం మ‌రిచిపోలేని జ్ఞాప‌కం

నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను చిన్న‌ప్పుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయ్యి, డ్యాన్స‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతూ… “నేను చిన్న‌ప్పుడు చిరంజీవి న‌టించిన ‘ముఠామేస్త్రి’ సినిమా తెగ చూసేదాన్ని. ఆయ‌న డ్యాన్స్‌కి ఫిదా అయ్యాను. ఆ త‌ర్వాత డ్యాన్స‌ర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అలా డ్యాన్స్‌పై ఆస‌క్తితో వివిధ షోల‌లో పాల్గొన్నాను. ఒక ఈవెంట్‌లో చిరుతో డ్యాన్స్ చేయ‌డం నాకు జీవితాంతం మ‌రిచిపోలేని జ్ఞాప‌కం” అని సాయి ప‌ల్ల‌వి చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవ‌ల తెలుగులో ‘తండేల్’ మూవీతో ఆమె సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి ప‌ల్ల‌వి… ‘ఎంసీఏ’, ‘ల‌వ్‌స్టోరీ’, ‘శ్యామ్‌సింగ‌రాయ్’ వంటి చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న ‘రామాయ‌ణ’ మూవీలో సీత‌గా న‌టిస్తున్నారు.

Related posts

ఆశ్చర్యపరుస్తున్న మహేష్ బాబు లుక్..!

TNR NEWS

మార్చి 7న విడుదల కానున్న ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’

TNR NEWS

చిత్రసీమలో నాకంటూ చిన్న స్థానం ఏర్పరచుకోవాలన్నది నా పెద్ద కోరిక

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS

డాకు మహారాజ్’ ఓస్ట్‌పై ఉత్తేజకరమైన అప్డేట్ ని వెల్లడించిన థమన్

TNR NEWS

రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న ‘వీర ధీర శూరన్‌’

TNR NEWS