సావిత్రిబాయ్ పూలె 195వ జయంతిని వెంకటసాయి పారామెడీకల్ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయ్ పూలె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి స్వీట్లు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి మాట్లాడుతూ విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యమని నమ్మి బాలిక విద్య ఉద్యమానికి పునాదివేసిన గొప్ప సంఘసంస్కర్త శ్రీ అభ్యుదయవాది అణగారిన వర్గాలకు అండగా నిలబడిన శ్రీమతి సావిత్రి పూలే
మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయ్ పూలె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాల గౌడ్ గారు, బీసీ యువజ సంఘం జిల్లా నాయకులు ఎర్పుల రవియాదవ్ ,జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి పరాల సాయి, జిల్లా కన్వీనర్ బయ్య రాజేష్, ప్రణవి, నికిత, సౌజన్య, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు…..
