నారాయణపేట నవంబర్24 (TNR NEWS ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ నవంబర్ 26 నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుగు బైక్ ర్యాలీ ,సభలను జయప్రదం చేయాలని కోరుతూ నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ఆదివారం రోజు కరపత్రాలను విడుదల చేసి, ప్రచారం చేయడం జరిగింది.
*ఈ సందర్భంగా రైతు కూలీలను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు బాలప్ప మాట్లాడుతూ* మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఇండియా కూటమి రైతులకు కనీసం మద్దతు ధరల చట్టం చెయ్యడం లేదని విమర్శించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ,ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పెంచి, రోజు కూలి ఆరు వందలు ఇవ్వాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.
స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న మహా ఉద్యమంలో రైతులు కూలీలు కార్మికులు బాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా,కార్మిక,రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగు నిరసన కార్యక్రమాల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో నవంబరు 26 న జరు నిరసనలో అధికసంఖ్యలో హాజరై విజయవంతము చేయలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు, భీమేష్,సీత సుదర్శన్ ,దస్తప్ప,భాను, తదితరులు పాల్గొన్నారు.