భారతదేశంలో శూద్రులు అస్పృశ్యుల మహిళ విద్యను నిరాకరించిన మనుస్మృతిపై పోరాడి మహిళలకు చదువు నేర్పిన మహాయోధురాలు సావిత్రి భాయి పూలే అని వారి ఆశయం సమానత్వమేనని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు.
ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ లో KVPS ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను 1848లో పూణే నగరంలో ప్రారంభించారని అన్నారు. 1873లో స్థాపించిన సత్య శోధక్ సమాజ్ ద్వారా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారని, కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారని తెలిపారు. స్త్రీ సాధికారతకు మార్గదర్శకురాలిగా నిలిచి కులమత భేదాలు లేని సమాజం కోసం తుదిశ్వాస వరకు కృషి చేశారని అన్నారు.సామాజిక అసమానతలను అంతం చేసి, అందరికీ అన్ని రకాల సమానత్వం సాధించాలనే లక్ష్యంతో సామాజికమార్పు కోసం పోరాడారని అన్నారు. ఆమె స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం అణిచివేత వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అందరికీ విద్య కోసం పూలే దంపతులు కృషి చేస్తే కాసులు ఉన్న కొందరికే కార్పొరేట్ విద్యను కేంద్ర బిజెపి సర్కార్ కట్టబెడుతుందన్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తుందని విమర్శించారు. సామాజిక సమానత్వం సాధించబడాలంటే దేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని అన్నారు, అస్పృశులు దళితులు, శూద్రులకు విద్యను దూరం చేసిన మనస్ఫృతిని నేటి ఆర్ఎస్ఎస్ బిజెపి సర్కార్ ప్రమోట్ చేస్తుందన్నారు తద్వారా రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులు సమాధి చేయబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ఆర్థిక సమానత్వం కోసం కృషి చేయడమే సావిత్రిబాయి పూలే ఆశయాలు సాధించడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో HWO వాణి జ్యోత్స్న సిబ్బంది జయమ్మ,సైదమ్మ, సునీత,నజీమా విద్యార్థులు నాగమణి,మాధవి,కావేరి, విద్య,హేమ,శ్రీకళ,నాగేశ్వరీ, నిధి తదితరులు పాల్గొన్నారు.
