కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్ఐ పాత పాడుబడ్డ క్వార్టర్స్ వద్ద పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు కాగజ్‌నగర్ టౌన్ సీఐ పి రాజేంద్రప్రసాద్ అదేశాల మేరకు టౌన్ ఎస్ఐ ధీకొండ రమేష్ అధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో పేకాట అడుతున్న నాలుగరు యువకులు పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ చందు, ఆర్ సురేష్, ఎం శ్రీనివాస్, జీ. నరేష్ లపై కేసు నమోదు చేశామని వారి వద్ద నుండి రూ. 4700/00 స్వాధీనపరచుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పేకాట, జూదం, మట్కా ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ధీకొండ రమేష్ హెచ్చరించారు.