ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అంబేద్కర్ మహనీయునికి ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి కృష్ణ మాదిగ,మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు మైసరాములు మాదిగ లు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి ఆయన బాటలో నడవాలని, అందుకోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చిట్యాల రవీందర్, మినుముల కర్ణకార్, ప్రజ్ఞాపూర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
previous post