శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో తన ఛాంబర్ నందు మెడికో విద్యార్థిని శిగ గౌతమికి లక్ష చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్, శిగ గౌతమి గురించి పేపర్లలో వచ్చిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి నిట్ పరీక్ష రాయగా ఎంబిబిఎస్ సీటుకు ఎంపిక అయ్యింది, తల్లిదండ్రి లేకపోయినా తాతా నాయనమ్మ సహకారంతో తను కష్టపడి చదివి మెడిసిన్ సీటు సాధించినందుకు జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆమె బాగా చదవాలని మంచి డాక్టర్ అవ్వాలని ఆశయంతో కలెక్టర్ ప్రభుత్వం తరఫున ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాగా చదువుకొని మంచి డాక్టర్ గా పేరు పొందాలని ఆశీర్వదించారు
.