హైదరాబాద్, ఏప్రియల్ 04 : వచ్చే సోమవారం నుండి ప్రారంభం ఉత్తర తెలంగాణలో రెండు రోజులు మరియు దక్షిణ తెలంగాణలో రెండు రోజులు కార్యక్రమంకి వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్, వికలాంగుల ముద్దు బిడ్డ ముత్తినేని వీరయ్య శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ లో ఆయన స్వయంగా పాల్గొని వికలాంగుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చైర్మన్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ లు ఏర్పాటు ఇదే మొదటి సారీ
హైదరాబాద్ లో రెండు రోజులు గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ వికలాంగుల చెంతకు వీరయ్య -2ప్రోగ్రామ్ (ప్రత్యేక గ్రీవెన్స్) కార్యక్రమం ప్రారంభం కానుంది. 7వ తేదీ హైదరాబాద్ జి.హెచ్.ఏం.సి కమిషనర్ తో నిరుద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం. 8వ తేదీ వికలాంగుల ఉద్యోగ సంఘాలతో సమావేశం (వికలాంగుల కార్పొరేషన్ ఆఫీస్), మరగుజ్జుల సమస్యలు పై మరగుజ్జుల నాయకులతో ప్రత్యేక చర్చ నిర్వహించనున్నట్లు తెలిపారు. 9వ తేదీ వికలాంగుల చెంతకు వీరయ్య ప్రోగ్రామ్ -2
ప్రత్యేక గ్రీవెన్స్ మేడ్చల్ మల్కాజ్ గిరి జోన్లో
అదే రోజు మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ని వికలాంగుల సంఘాల నాయకులు, సభ్యులతో కలసి జిల్లా సమస్యలు పై వినతి పత్రము అందజేయడం జరుగుతుందన్నారు. 10వ తేదీ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లాల అధ్యక్షులు & ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. 12వ తేదీ ముఖ్యమైన వికలాంగుల సంఘాలతో రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వికలాంగుల సంక్షేమం పై ఇంటెలెక్చ్యువల్ డిష్కషన్ చేయడం జరుగుతుందని ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.
