Tnrnews.in
ఆంధ్రప్రదేశ్సినిమా వార్తలు

కిరణ్ రెడ్డి తుమ్మ సినీ ప్రయాణం యువతకు ఆదర్శం కావాలి

క్రమశిక్షణ, పట్టుదల గురువులంటే గౌరవం సినీ సేద్యంలో మొక్క ఎదుగుదలకు ఎరువు. ఎక్కడో మారుమూల పల్లెప్రాంతం. సినీ మూలాలు అస్సలు లేవు. రంగారెడ్డి జిల్లాలో, రెడ్డి పురంలో పుట్టి పూర్వ జన్మ సుకృతమో, పట్టుదలో తెలియదు గురువుల ఆశీర్వాద బలంతో 2003లో తెలుగు సినీ పరిశ్రమకు సాదా సీదాగా ప్రవేశం. నిరాశ మిగిలింది. ప్రయత్నాలు ఆపలేదు వ్రాసే అక్షరాలు ఆగలేదు, అదే ధ్యాస. మరో కొమ్మ ఊతం అసిస్టెంట్ డైరెక్టర్ని చేసింది. ప్రయత్నాలు ఫలించి మిల్క్ బాయ్ లా ఉన్న కిరణ్ రెడ్డి ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆస్థానంలోకి ప్రవేశించారు… అంతే వరుసగా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కష్టపడి పనిచేశారు. తనకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏదో సాధించాలన్న తపన చిగురిస్తూనే ఉంది తుమ్మలో. డైరెక్టర్ గా 2014లో దిల్ దివాన సినిమా తీశారు. ఎందుకో తృప్తి కలుగలేదు. కొంతకాలం గ్యాప్ తరువాత. ప్రముఖ డైరెక్టర్ సాయి కిరణ్ డైరెక్ట్ చేసిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. నిరంతర సినీ ప్రయత్నాలు సాగిస్తూనే కథలు వ్రాసుకుంటూ ఉండగా హార్ట్ స్టార్ లో మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ కు కో-డైరెక్టర్ గా పనిచేశారు. తరువాత జి5కి రెండు ప్రాజెక్ట్స్ రావడం పని చేయడం జరుగుతూనే ఉంది. కానీ చేసే పనికి అప్రిశేషన్ రావడం లేదు. చేతులు కాలుతున్నాయి, శ్రమ శ్రమిస్తూనే ఉంది. ఎండమావి లాంటి సినీ ప్రయాణాన్ని విజయవంతం చేయాలనే చిన్నపాటి ఆలోచన ‘ఈఏంఐ’ రూపంలో వచ్చి ప్రశంసల జల్లు కురిపిస్తుంటే… పడిన కష్టాన్ని మరిచి పెద్ద తెర మీదకు వామనునిలా బులి బుల్లి అడుగులు వేస్తూ మహా వృక్షంగా ఊడలు వేస్తారనడంలో అతిశయోక్తి లేనే లేదు… సుదీర్ఘ ప్రయాణం, నిరాశ, నిస్పృహలను దాటుకుంటూ వంటరిగా కిరణ్ రెడ్డి తుమ్మ చేసిన సినీ ప్రయాణం యువత కు ఆదర్శం. యువతకు మేల్కొలుపు. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని సినీ జగత్తున నిలవాలని ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

త్రయీ సాధన ద్వారానే మానవత్వమును పరిమళింపచేసుకోవచ్చు – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

పారిశ్రామిక వేత్తలుగా మహిళలు పరిణామం చెందాలి : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

శివుడు ఎలా పుట్టాడో తెలుసా? శివుని జననం మరియు అవతారం యొక్క ఉత్తేజకరమైన కథ ఇక్కడ ఉంది.!!

Dr Suneelkumar Yandra

కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

Dr Suneelkumar Yandra

గౌరీ నాయుడుకి గురుపూజోత్సవంలో ఘన సత్కారం

Dr Suneelkumar Yandra