అనంత పద్మనాభ స్వామి ని దర్శించుకున్న రాష్ట్ర హై కోర్ట్ న్యాయమూర్తి నగేష్ బీమపాక.
తెలంగాణ రాష్ట్రము లోని వైష్ణవ క్షే త్రాలలో ప్రసిద్ధి క్షే త్రమైన అనంతగిరి అనంత పద్మ నాభ స్వామిని
ఆదివారం తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయ మూర్తి గౌరవ నగేష్ భీమపక దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా
ముందుగా జిల్లా లో అనంత గిరి హరిత రిసార్ట్ కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి గారికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా జడ్జి డాక్టర్. సున్నం శ్రీనివాస్ రెడ్డి గార్లు పూల మొక్క అందజేసి గౌరవ స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ శాఖ వారి చే గౌరవ వందనం స్వీకరించారు.
అదేవిదంగా మంగళ వాయిద్యాలు,వేద మంత్రాల మధ్యదేవస్థానం ఇ ఓ, ఆలయ అర్చకుల చేత పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదర్శన నిర్వహించి అనంత పద్మనాభ స్వామికి తులసి దళ సేవలు, అర్చనలు నిర్వహించారు.
వేదపండితులచే వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామి వారి జ్ఞాపిక ను అందజేశారు.
ఈ కార్యక్రమం లో ఆగనూర్ శ్రీనివాస్,
ఆలయ ఇ ఓ నరేందర్, ప్రధాన అర్చకులు శేష గిరి, పద్మ నాభం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.