Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మోడల్ స్కూల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

రంగారెడ్డి జిల్లాల్లోని మోడల్ స్కూల్ లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందించినట్లు మోడల్ స్కూల్ వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఏజెన్సీ రెన్యువల్ తో పాటు గత నాలుగు నెలల నుండి వేతనాలు అందడం లేదని వినతిపత్రంలో తెలియజేశారు. వెంటనే స్పందించిన డిప్యూటీ కలెక్టర్ ప్రతిమ డీఈవో సుశిందర్ రావును పిలిపించి వెంబడే వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణు ప్రియ, మోడల్ స్కూల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు కాశీ, యాదయ్య, యాదమ్మ, రంగారెడ్డి జిల్లా పీడీ అధ్యక్షుడు వేద ప్రకాష్, ఆయా మండలాల మోడల్ స్కూల్ సిబ్బంది మల్లేష్, హేమలత, నవనీత, శేఖర్, రాధాకృష్ణ, సతీష్, ఉపేందర్, సుధాకర్, జంగయ్య తదితరుల పాల్గొన్నారు.

Related posts

శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దీవెనలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

Harish Hs

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిల్లుట్ల శ్రీనివాస్ నియామకం…. గతంలో కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన పిల్లుట్ల శ్రీనివాస్…..

TNR NEWS

టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.

Harish Hs

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS