April 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన. మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.

వికారాబాద్ పట్టణ పరిధిలోని గన్నారం సమీపంలో అనంత రెడ్డి మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో యువత చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు. ఈరోజు

సిడ్ స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి గారితో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు.

అక్టోబర్ 2న ప్రారంభమైన ప్లాటినం కప్, గోల్డ్ కప్, సిల్వర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో 16 టీమ్ లు పాల్గొన్నాయని, ఈరోజు ఫైనల్ మ్యాచ్ లు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు శ్రీధర్ వెల్లడించారు. ప్లాటినం కప్ విజేతలుగా నిలిచిన కేసారం కింగ్స్ టీమ్ చైర్ పర్సన్ గారి చేతుల మీదుగా మొదటి బహుమతి అందుకోగా, చేవెళ్ల ఇబ్రహీంపల్లి టీమ్ రన్నర్స్ గా నిలిచింది. గోల్డ్ కప్ నుండి వికారాబాద్ గోపాల్ 11 టీమ్ విజేతలుగా, రన్నర్ గా అన్ లిమిటెడ్ స్పోర్ట్స్ సంగారెడ్డి టీమ్ నిలిచింది. అలాగే సిల్వర్ కప్ విజేతలుగా మహావీర్ హాస్పిటల్ టీమ్ విజయం సాధించగా, SAP క్లబ్ టీమ్ రన్నర్ గా నిలిచింది. ఫైనల్ లో గెలిచిన అన్ని టీమ్ లను చైర్ పర్సన్ మంజుల రమేష్ గారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మాజీ గ్రంథాలయ చైర్మన్ హఫీజ్, టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీధర్, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు…?

Harish Hs

బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి

TNR NEWS

నవోదయ లో సీటు సాధించిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థిని

TNR NEWS

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

*పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కసరత్తు.. జనవరి 14న నోటిఫికేషన్.. ఎన్నికలు ఎప్పుడంటే..!!*

TNR NEWS