టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
రైతన్నలు వడ్లను పొలాల దగ్గర నుంచి మిల్లుకు ట్రాక్టర్ల మీద బోరేం లతో తీసుకు వెళుతున్న సమయంలో ట్రాక్టర్కు స్పీకర్లు పెట్టుకొని, శబ్దం ఎక్కువగా వచ్చేటట్టు పాటలు పెట్టుకుని వెళ్తున్నారు.దాని వలన వెనకనుంచి వచ్చే వాహనాల హారన్ శబ్దం వినపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనదారులతో పాటు ప్రజలు, మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున దయచేసి రైతన్న లు ఎవరూ వడ్లని మిల్లులకు తీసుకెళ్లే క్రమంలో ట్రాక్టర్లకు స్పీకర్లు పెట్టుకొని వెళ్లకూడదు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మీ శ్రేయస్సు దృష్ట్యా అలా స్పీకర్లు పెట్టుకునే వెళ్ళిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి రైతన్నలు మరియు పట్టరు వడ్లను మిల్లులకు తీసుకు వెళ్ళేటప్పుడు స్పీకర్లు పెట్టుకొని వెళ్ళవద్దని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.