Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

టి ఎన్ ఆర్ న్యూస్ హైదరాబాద్

 

హైదరాబాద్:నవంబర్ 11

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతు న్నారని మండిపడుతు న్నారు.

 

రైతులు. సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారన్నారు. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాపోతు న్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలంటూ పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.

 

మిల్లుల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అన్యాయం చేస్తున్నారని.. తేమశాతం, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

 

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) చట్టం కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సోమవారం మాట్లాడారు.

రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Related posts

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హమీలను నెరవేర్చాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత  గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 

TNR NEWS

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

TNR NEWS

సర్వే పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ పమేలా సత్పతి

TNR NEWS

బడుగు బలహీన వర్గాల బాగు కోసం కులగణన సర్వే    బొమ్మ కంటి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ సెల్ అధ్యక్షులు

TNR NEWS

*పిట్లం ఎమ్మార్వో ఆఫీస్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్*

TNR NEWS