కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసర బాధలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం, తహసిల్దార్ రోడ్ లోని విశ్వనాథ స్వామి దేవాలయం, విద్యానగర్ చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పాత బస్టాండ్ రోడ్ లోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేం చేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వస్థలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు. కార్తీకమాసంలో విశేషమైన శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభిషేకం శివలింగాకృతిలో దీపోత్సవం ఆకాశపూజ దీప పూజలు నిర్వహించారు. భక్తులకు కార్తీక పురాణాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం అద్యక్షులు నూక వేంకటేశము గుప్త, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ కోశాధికారి పాలవరపు రామమూర్తి సభ్యులు సోమ శ్రీశైలం, బెలిదే అశోక్, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, యామా వెంకటేశ్వర్లు,బ్రాహ్మoడ్ల పల్లి సంతోష్ కుమార్,దేవి దత్తు ,కర్నాటి సూర్య కళ, భక్తులు దేవరశెట్టి సత్యనారాయణ, యర్రమళ్ల ప్రసాద్, కర్నాటి రామమూర్తి, ఇల్లందులో జగన్మోహన్, నవీన్, దేవాలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ,బట్టారం వంశీకృష్ణ శర్మ ,ధరూరి కృష్ణమాచార్యులు, రామ్ నారాయణ పాండే, జగదీశ్వరి దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.