మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన మూడగాని కనకయ్య(56)ఇటీవల తాటిచెట్టుపై నుంచి కింద మృతి చెందగా,మృతుని కుటుంబాన్ని గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్ శనివారం పరామర్శించారు.నిరుపేద గీత కార్మికుడైన కనుకయ్యకు ముగ్గురు కూతుర్లు,ఒక కుమారుడు ఉన్నాడని, కనుకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తిరుపతి గౌడ్ కోరారు.ఆయన వెంట గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్యాల రాములు గౌడ్,నియోజకవర్గ ఇంచార్జి గోపగోని నవీన్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు మూడగాని అనిల్ గౌడ్, పంజాల సదానందం,సంపత్ గౌడ్,సంఘం నాయకులున్నారు.