నల్గొండ టౌన్:
తెలంగాణ మోడల్ స్కూల్స్ లో అవర్లీ బేస్డ్ టీచర్స్ (హెచ్.బి.టీ) ఎదుర్కొంటున్న సమస్యలను గురించి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం (ఎమ్మెల్సీ) ని ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్.బి.టి ల ప్రధాన సమస్యలు పరిష్కారం, గౌరవ వేతనం పెంపు, మినిమం టైం స్కెల్ తదితర అంశాలను విన్నవించడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. అంతేకాకుండా హెచ్.బి.టి లు విధుల్లో (గంటకు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్స్) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్.బి.టి దేవరకొండ నియోజకవర్గ క్రియాశీలక కమిటీ సభ్యులు ఖలీగ్ కరుణాకర్ , శివ , రవి , శంసన్ ,రాజశేఖర్ , శ్రీనివాస్ , రాజేందర్ , షాహీన్ , ప్రగతి తదితరులు పాల్గొన్నారు.