మల్యాల మండలం ముత్యంపేట గ్రామం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారిని ఆదివారం సినీ నటుడు హీరో శ్రీకాంత్,నటుడు చంద్రకాంత్,నిర్మాత విజయ్ లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రామకృష్ణారావు శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి , అర్చకులు వేదోచ్చరణ తో ఆశీర్వదించారు.నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వి.అంజయ్య,పర్యవేక్షకులు గుండి హరిహర్నాథ్,సునీల్,ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రదాన అర్చకులు చిరంజీవి,చంద్ర శేఖర్,టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్ తదితరులు పాల్గొన్నారు.