November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బీ ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో గురుకుల బాట. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సమస్యల పైన. గురుకుల పాఠశాలలో సందర్శించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి బాలుర గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది అదేవిధంగామైనారిటీ గురుకుల పాఠశాల,మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బి ఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆహారం సరిగ్గా లేక అనేకమంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకుతకు గురైన సంగతి తెలిసిందే విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంపై పోరాడడానికి సిద్ధమవుతున్నామని. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గురుకుల పాఠశాలలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. వికారాబాద్ లోని అనంతగిరిపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్నారని, విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని ఉడికి ఉడకని వంటలతో విద్యార్థులు సతమతమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువచ్చారనిఆయన తెలిపారు.విద్యార్థులు అనారోగ్యానికి గురయితేఅందుబాటులో ఉండాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని పాఠశాలను శుభ్రంగా ఉంచడంలో సిబ్బంది విఫలమవుతుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫామ్ లు విద్యార్థులకు అందించలేదని వారు వాపోయారని తెలిపారు. మైనారిటీ గురుకుల పాఠశాలకు సంబంధించి పక్కా భవనం నిర్మాణం కోసం కెసిఆర్ గారి ప్రభుత్వంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పక్కా భవనం నిర్మానించడంలో వెనుకంజ వేస్తుందని. పక్కా భవనం లేక పారిశ్రామికవాడలో పారిశ్రామిక భవనంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి పక్కా భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నిటిని రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పించి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎండగడతామని తెలిపారు… ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు మంచన్ పల్లి సురేష్.విద్యార్థి విభాగం నాయకులు మురంగపల్లి కృష్ణ. జైలు పల్లి సురేష్. వరుణ్, ఆర్ రాజు, ఫెరోజ్, విద్యార్థుల తల్లిదండ్రులుతదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం,లక్ష్యం ఉండాలి

Harish Hs

ప్రతి రైతు నానో స్ప్రే యూరియా వాడాలి

TNR NEWS

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతో అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం.: పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

TNR NEWS

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు

Harish Hs

అక్షర యోధుడు కాళోజి

Harish Hs