పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని, గిరిజన ఆశ్రమ పాఠశాల బాలుర లో అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి. యమున ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య శిబిరము నిర్వహించారు. ఇట్టి వైద్య శిబిరం లో వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న జబ్బులతో, బాధపడుతున్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో 62 మంది పిల్లలకు గాను, 36 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఇందులో ఒక్కరిని జ్వర పీడితులగా గుర్తించి, మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు. మిగతా 35 మంది పిల్లలకు వివిధ రకాల దురద, జలుబు, దగ్గు వంటి జబ్బులుగా గుర్తించారు. అనంతరం డాక్టర్ యమున మాట్లాడుతూ.. పిల్లలు తమ వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించి తగు సూచనలు ఇచ్చారు. తధానంతరం ఆశ్రమ పాఠశాలలోని కిచెన్, స్టోర్ రూమ్, డార్మెంటరీ, మరుగు దొడ్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ వైద్య శిబిరంలో పల్లె దావఖాన డాక్టర్ ప్రతిభ, పాఠశాల ప్రిన్సిపాల్ ఈసం సుధాకర్, వార్డెన్ సురేందర్, హెచ్ ఈ ఓ లోక్య నాయక్, సూపర్వైజర్ గణేష్, హెల్త్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
previous post