Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

: తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల మేధస్సును గుర్తించడం జరిగిందని తెలంగాణ గణిత ఫోరం మండల అధ్యక్షులు షకీల్ పాష అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో మండల స్థాయి ప్రతిభా పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్ లు అందజేయడం జరిగిందన్నారు. మండల స్థాయి ఇంగ్లీష్ మీడియంలో ప్రతిభా పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందుప్రియాల్ ఈ.అనూష, ద్వితీయ స్థానం జి. క్రిష్ణేశ్వరి,తృతీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముబారస్ పూర్ షేక్ రహ్మేత్ ఉన్నిస.తెలుగు మీడియంలో ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట ఏ. ఆకాంక్ష, ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట ఈ. చందన తృతీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర దౌల్తాబాద్ ఏ. రామ్ చరణ్ విద్యార్థులు గెలుపొందారు. వీరు డిసెంబర్ 11న సిద్దిపేట జిల్లా కొడకండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అఫ్జల్ హుస్సేన్, ఉపాధ్యాయులు నర్సింలు, సుధాకర్, రాజయ్య, జంపన్న, మహిపాల్, మహేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పౌరులు చట్టాలకు లోబడి నడుచుకోవాలి

Harish Hs

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం

TNR NEWS

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

Harish Hs

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

Harish Hs

గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి 

TNR NEWS

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs