April 5, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం తొగరాయి గ్రామ పరిధిలో అతి ఘోర రోడ్డు ప్రమాదం.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తొగర్రాయి గ్రామానికి చెందిన తూముల నాగేశ్వర కుమారుడు తూముల గోపి వయసు 23 సంవత్సరాలు వృత్తి లారీ డ్రైవర్ అతను డ్యూటీ నిమిత్తమై డ్రైవర్ గా వెళ్ళగా జార్ఖండ్ రాష్ట్రంలో సుమారు ఐదు రోజుల క్రితం గుండెపోటుతో మరణించినాడు. అతనిని ఈరోజు తన స్వగృమైన తొగర్రాయి గ్రామానికి తీసుకురావడం జరిగినది.ఈ విషయం తెలుసుకున్న మృతుని దగ్గర రక్తసంబందకురాలైన మోతే మండలం నరసింహపురం గ్రామానికి చెందిన సహోదరి విజయలక్ష్మి ఆమె భర్త రమేష్ తో కలిసి మృతుని కుటుంబాన్ని ఓదార్చటానికి తొగర్రాయి గ్రామం చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణంలో వారి సొంత గ్రామానికి బయలుదేరగా తొగర్రాయి గ్రామ ప్రాంతంలో గురప్ప స్వామి దేవాలయం సమీపంలో వెనకనుంచి అతివేగంగా వస్తూ ఢీ కొట్టిన లారీ అక్కడికక్కడే మహిళా మృతి, భర్తకు తీవ్ర గాయాలు అతనిని మెరుగైన వైద్యం కొరకు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.

Related posts

ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి 

TNR NEWS

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

TNR NEWS

విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం

Harish Hs

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతి వేడుకలు 

TNR NEWS

*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.!!*

TNR NEWS

ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం

Harish Hs