వేడుకల పేరిట డబ్బును వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,రమేష్ అన్నారు. బుధవారం స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో అమెరికాలో ఉంటున్న కోదాడకు చెందిన తొగరు నవీన్, జ్యోతిల కుమార్తె ప్రాజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మేనమామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బరపటి కోటేశ్వరరావు తో కలిసి అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకొని అనాధ పిల్లలకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బరపటి కోటేశ్వరరావు, ఇమ్రాన్, నాగుల్, మనీ, సత్తార్, రాజేష్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…….

previous post
next post