పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించటం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం కోదాడ లోని ముస్లిం మైనార్టీ బాలికల పాఠశాలను కోదాడ శాసన సభ్యురాలు నల్లమాద పద్మావతి రెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఇక్కడికి రావటం జరిగిందని సమాజం లో విద్య ద్వారానే గుర్తింపు వస్తుంది కాబట్టి మా ప్రజా ప్రభుత్వం విద్య పై ప్రత్యేక శ్రద్ద పెట్టినాము అని ప్రతి నియోజకవర్గం లో 200-300 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయి లో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, స్కిల్ యూనివర్సిటీ తో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత 100 శాతానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.మా ప్రభుత్వం లో సాంఘీక న్యాయం చేకూర్చేందుకు అన్ని వర్గాలకు లబ్ది చేకూర్చుతున్నామని తెలిపారు.
ఈ నూతన సంవత్సరం విద్యార్థులతో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని, గత రాత్రి హుజూర్ నగర్ ఎస్ సి సంక్షేమ బాలుర పాఠశాల విద్యార్థులతో భోజనం చేసానని, ఉదయం హుజూర్ నగర్ సబ్ జైలు ఖైదీలను కలిసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నానన్ని అలాగే మధ్యాహ్నం మైనారిటీ బాలికల పాఠశాలకి వచ్చి విద్యార్థులతో ముఖాముఖీ అవుతు భోజనం చేయటం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్టంలోని ఎస్ సి, ఎస్టీ,బిసి, మైనార్టీ లకి చెందిన 6 లక్షల మంది విద్యార్థుల సంక్షేమం కొరకు వారిలో విద్య ప్రమాణాలు, పోషకాలు పెంచేందుకు ప్రభుత్వం పై 600 కోట్ల భారం పడిన 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు.రేపటి దేశ భవిష్యత్ నేటి విద్యార్థులపైననే ఆధారపడి ఉంటుంది కాబట్టి వారికి నాణ్యమైన విద్య అందించి తెలంగాణ విద్యార్థులకి ప్రపంచంలో గుర్తింపు తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి లబ్ది చేకూర్చేలా త్వరలో అందరికి సన్న బియ్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, పాఠశాలలకి పౌర సరఫరాల శాఖ ద్వారా సప్లై చేసిన బియ్యం నాణ్యత బాగుందని తెలిపారు.
గుడిబండ కి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆయేష సిద్దిక మాట్లాడుతూ ఈ పాఠశాలలో నేను ఐదవ తరగతి లో చేరినానని అప్పుడు ఉన్న చదువు,ఆహారం లో నాణ్యత కంటే ఇప్పుడు చాలా బాగుందని, ఉపాధ్యాయులు మా మీద ప్రత్యేక శ్రద్ద పెట్టి చదివిస్తున్నారని తెలిపారు.
అలాగె పదవ తరగతి కి చెందిన విద్యార్థిని మైతిన్ మాట్లాడుతూ డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందించటంతో మాకు ఆరోగ్యం బాగుండి మంచిగా చదువుకుంటున్నాం అని మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచినందుకు మంత్రి కి ధన్యవాదములు తెలిపారు.రాత్రి పాఠశాల లోకి దోమలు రాకుండా మెస్ డోర్లు, ఐ ఐ టి, నీట్ లాంటి పరీక్షలకి సిద్ధం అయ్యేందుకు పుస్తకాలు, మినరల్ వాటర్ కొరకు ఆర్వో ప్లాంట్, డిజిటల్ క్లాస్ లకి ప్రొజెక్టర్ కావాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు మంత్రి ద్రుష్టి తీసుకొని రాగా మెస్ డోర్లకి 2 లక్షలు, ఆర్వో ప్లాంట్ కి 2 లక్షలు, ఐ ఐ టి నీట్ పరీక్షలకి బుక్స్,ప్రొజెక్టర్ మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
తదుపరి కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాఠశాలలో విద్యార్థులు ఐదవ తరగతి నుండి ఇంటర్ వరకు అందరు ఇంగ్లిష్ లో మాట్లాడటం చాలా సంతోషం అని అలాగే టీచర్స్ కూడా రాత్రి 9 వరకు ఉండి ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులపై శ్రద్ద తీసుకోవటం చాలా అభినందనీయం అని ఇంటర్, పదవ తరగతి లలో నూరు ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.
తదుపరి రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి గారు నూతన సంవత్సరం విద్యార్థులతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఈ పాఠశాలని ఇంటర్ నుండి డిగ్రీ వరకు అప్ గ్రేడ్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ సూర్యనారాయణ, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్ రెడ్డి,తహసీల్దార్ వాజీద్, ఎం ఈ ఓ సలీం షరీప్, ప్రిన్సిపల్ మాధురి శర్మ, ఆర్ ఐ రాజేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.