November 18, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకువచ్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద విద్యార్థులకు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను టీటీడీ నుంచి తెప్పించిన ప్రత్యేక శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబు,పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్, పైడిమర్రి వెంకటనారాయణ,లారీ అసోసియేషన్ సెక్రటరీ ఎలగందుల నరసయ్య, బాబా, తరుణ్ తదితరులు పాల్గొన్నారు…….

Related posts

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Dr Suneelkumar Yandra

మార్వాడీ దుకాణాలను తనిఖీ చేయాలని వినతి

TNR NEWS

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

TNR NEWS

షార్ట్ సర్క్యూట్ తో మీసేవ దగ్ధం

TNR NEWS

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS