సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి మహిళ ఉపాధ్యాయునిగా నిలిచిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి మార్గదర్శకురాలని ఆమె త్యాగాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం అనేక విద్యా సంస్థల స్థాపించి పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చి సంఘంలో ఉన్న దురాచారాలను మట్టుబెట్టిన మహిళగా నేటి మహిళలకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచారని ఆమె సేవలను కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆమె చూపిన బాటలో నడవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, నియోజకవర్గ నాయకులు గుండె పంగు రమేష్, జిల్లా కార్యదర్శి కంపాటి శ్రీను, బాజన్, గంధం రంగయ్య, గంధం పాండు, పాస్టర్ యేసయ్య, నెమ్మది దేవమని, పాలడుగు సంజీవ్, కుడుముల రాంబాబు, కుడుముల శ్రీను, భాజాన్, రామదాసు, పిడమర్తి బాబురావు, షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు……….