డిండి: (గుండ్లపల్లి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని మంగళవారం సాయంత్రం జరిగిన మండల మహాసభలలో ఎకగ్రీవంగా ఎన్నుకోవడమైంది.మండల అధ్యక్షులుగా గండమల్ల రామారావు, ప్రధాన కార్యదర్శిగా పవన్ నారోజు, ఉపాధ్యక్షులుగా కె. హరిలాల్,ఎం. సుజాత, కోశాధికారిగా వి.శ్రీనయ్య,ఎఫ్.డబ్ల్యూ.ఎఫ్ కన్వీనర్ గా ఎండి ఖాజా రహమతుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా,ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాస్ చారి,జిల్లా సాంస్కృతిక కన్వీనర్ గిరి యాదయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, డీఎస్సీ 2024లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయుల జాయినింగ్ తేదీ పై క్లారిఫికేషన్ ఇచ్చి,వారి మొదటి నెల వేతనాలు త్వరగా అందేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు తిరుపతయ్య, సుధాకర్,సీనియర్ నాయకులు బి.యాదయ్య,పూర్య నాయక్, ధనమ్మ,రాంబాబు,బుజ్జిరాణి,షాహీన్ మరియు నూతన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.