బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన పొనుగోటి రంగాను ఎంపిక చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నియామక పత్రాన్ని జారీ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం నియామక పత్రాన్ని కృష్ణయ్య పొనుగోటి రంగాకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి అందించాల్సిన సంక్షేమ ఫలాల కోసం బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో, దేశంలో బీసీల అధికారమే లక్ష్యంగా మునుముందు మరిన్ని పోరాటాలు నిర్వహింస్తామన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రకారం గా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పొనుగోటి రంగాను అభినందించారు. అధ్యక్షుడు రంగా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు చెప్పారు. జిల్లాలో బీసీల అందరిని ఐక్యం చేసుకొని బీసీల సంక్షేమానికి ఉద్యమిస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన కృష్ణయ్య నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతనన్నారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లుట్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్, బిసి యువజన సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్, బీసీ నాయకులు రాజేష్, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.