Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

మోతే: ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మోతే మండలానికి వచ్చిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరారు. కంపెనీపనులు పూర్తి అయితే చుట్టుపక్కన గ్రామాలైన ఆత్మకూర్ (ఎస్) మండలంశెట్టి గూడెం, కోట పహాడ్, మోతే మండలం సర్వారం, కూడలి, అప్పన్నగూడెం, బురకచర్ల, గోల్ తండా, మేకల పాటి తండా, సిరికొండ గ్రామాలతో పాటు అనేక గిరిజన తండాలు, వీటితో పాటు చుట్టుపక్కన ఉన్న అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యం పైఇథనాల్ కంపెనీ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.ఈ ఇథనాల్ కంపెనీ కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల తో పాటు గుండె, మెదడు, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నెలకొని ఉందన్నారు. దీని మూలంగా భవిష్యత్తులో చుట్టూ 20 కిలోమీటర్ల మేర మనుషులు బతికే పరిస్థితి ఉండదన్నారు. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం మూలంగా రైతుల పంటలు పూర్తిగా నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బంగారo పండే పంట భూములు బీడు భూములుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు.ఈ ఫ్యాక్టరీ నుండి విడుదల అయ్యే వ్యర్ధాలను పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ లోకి వదిలితే చుట్టుపక్కన ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి నీరు కలుషితంగా మారి ప్రజలు, రైతులు, పశువులు, చేపలు, మూగజీవులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయమై తక్షణమే స్థానిక ఎమ్మెల్యే అయిన ఉత్తం పద్మావతి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జోక్యం చేసుకొని అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా నాయకులు మండారి డేవిడ్ కుమార్, మట్టిపల్లి సైదులు, నల్లెడ మాధవరెడ్డి, గంట నాగయ్య, కొనుకుంట్ల సైదులు, అలుగు బెల్లి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం

TNR NEWS

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

TNR NEWS

పెదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ ప్రోగ్రామ్ షురూ…

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

TNR NEWS

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS

టి పి టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

TNR NEWS