సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందాల రంజిత్ రెడ్డి దాదర్ ప్రశాంతలు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన నియమాలను పరిష్కరించాలని కోరుతూ కొనసాగుతున్న సమ్మెకు సోమవారం వారు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక రంగాలలో కేజీబీవీ ఇతర జిల్లా, మండల స్థాయి టెక్నికల్ వర్క్, అదే విధంగా అనేక రంగాలలో కాంట్రాక్టు పద్ధతి కింద పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఆఫీసర్లు, కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు, బోధినేతర సిబ్బంది, అకౌంటెంట్ లు, జిల్లా, మండల స్థాయిలో డాటా ఎంట్రీ ఇలా అనేక రంగాలలో వెట్టి సాకిరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నా గానీ కనీస పనికి కనీస వేతనం కూడా లేని పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి ఉందని, గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమ్మె వద్దకు వచ్చి వారి సమస్యలు మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వారిని పట్టించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు అనేకంగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వానికి కనీసమైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని, కావున వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మినెంట్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా వారితో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా నాయకులు తాడూరి భరత్ కుమార్, కోనేరు ప్రవీణ్ కుమార్, సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను, కార్తీక్, ప్రవీణ్ అజయ్ పండు వరుణ్ సమగ్ర శిక్షణ ఉద్యోగులు పాల్గొన్నారు.