కోదాడ: తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలగపల్లి సత్యనారాయణ అన్నారు. అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం నా భార్య విద్యుత్తు షాకుతో మరణించారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. టాటా బీమా ఇన్సూరెన్స్ ద్వారా 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం తపాలా శాఖా పాసుబుక్ ఖాతాలోకి జమచేశారు. అట్టి రూపాయలను నా ఇద్దరి కూతుర్ల పేరున పిక్స్ డిపాజిట్ తపాలా శాఖ ఆధ్వర్యంలో జమ చేశానని అన్నారు. కొందరు గ్రామస్తులు 50 లక్షల రూపాయలు వచ్చినాయని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసిక ఒత్తిడికి కురిసేస్తున్నారని తెలియజేశారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని లేదంటే చట్టపరమైన పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. నా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు నా ఇద్దరు కూతుర్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను ఎకరం పొలం కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది ఇద్దరు కూతుర్లకు రెండింతల వాటా ఇచ్చి నేను ఒక వంతు తీసుకుందామనుకున్నా మాట వాస్తవమే కానీ నేను నా పిల్లలకు ద్రోహం చేసే వ్యక్తిని కాదు గ్రామంలో కొంతమంది సూటి పోటీ మాటలు జీర్ణించుకోలేక పోతున్నానని మండిపడ్డారు ఇకనైనా ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోనని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు… ఇట్టి విషయంపై పోస్ట్ అధికారి కొల్లు జ్యోతిని వివరణ కోరగా ఇద్దరు కూతుర్ల పేరుమీద పది లక్షల రూపాయలు పిక్స్డ్ డిపాజిట్ చేశారని వాస్తవాలు తెలిపారు.