సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని తాళ్ల గడ్డ కు చెందిన రాపర్తి మల్సూర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుమారుడైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాపర్తి రమేష్ గౌడ్ లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పరామర్శించారు. అలాగే ఇటీవల కక్కిరేణి శివకుమార్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాపర్తి మల్సూర్ గౌడ్ చనిపోవడం బాధాకరమన్నారు. అలాగే యువకుడిగా ఉన్న కక్కిరేణి శివకుమార్ చిన్నతనంలో చనిపోవడం బాధాకరమని అన్నారు. వీరి ఇద్దరి మరణం ఆ కుటుంబ సభ్యులను శోకసముద్రంలో నెట్టి వేసింది అన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు.ఆమె వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పాల్గొన్నారు.