గతంలో నిజమాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ లు నిలబెట్టుకున్నారని బాజపా మండల అధ్యక్షుడు కొమ్ముల రాజపాల్ రెడ్డి అన్నారు.మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో మంగళవారం రైతులు, మహిళలు నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు నిజమైన సంక్రాంతి పండగ జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బొగ గంగాధర్,రైతులు కొట్టాల శ్రీనివాస్, గడ్డం శివారెడ్డి, ఏసాల ప్రశాంత్, గడ్డం భూమేశ్వర్, బద్దం మోహన్, కొమ్ములపెల్లి జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

previous post