Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
సినిమా వార్తలు

పద్మ అవార్డులు అందుకోనున్న వారికి చిరంజీవి అభినందనలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులకు ఎంపికైన వారికి ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్, అనంత్‌ నాగ్, శేఖర్ కపూర్ జీ, ‘రుద్రవీణ’ చిత్రంలో సహనటి శోభనకు అభినందనలు తెలియజేశారు. అలానే అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వీరంతా అవార్డులకు అర్హులని చిరంజీవి పేర్కొన్నారు.

Related posts

8 వసంతలు’ నుండి ఫస్ట్ సింగల్ అవుట్

TNR NEWS

నేటి కుటుంబాల విధానాలపై స్పందించిన ఎల్బీ శ్రీరామ్

TNR NEWS

స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన ‘మామన్’

TNR NEWS

రాష్ట్ర కార్యదర్శిగా కనెవేని శ్రీనివాస్

TNR NEWS

అనుపమ పరమేశ్వరన్ – ధ్రువ్ విక్రమ్ ప్రేమాయణం!

TNR NEWS

ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్…

TNR NEWS