ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని,ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు, రికార్డులు నిర్వహణ అంశాలపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోట చలం అన్నారు.శనివారం కోదాడ నియోజకవర్గంలోని మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మరియు రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయం పాలన పాటించాలని,రిజిష్టర్,రికార్డ్స్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని,
ఆన్లైన్ సర్వీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఉన్నత అధికారులకు క్షేత్రస్థాయిలో అందించాలని పెండింగ్ లేకుండా చూసుకోవాలని,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మాత శిశు సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని,ఎన్సీడీ నిర్వహణ మందుల పంపిణీ కార్యక్రమం హెచ్ఎం ఐ ఎస్ ప్రోటల్ ల్లో పెండింగ్ లేకుండా అప్లోడ్ చేయాలని ఇతర ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ అయ్యేలా ఆరోగ్య సిబ్బందిని పనిచేయాలని, గర్భిణీ స్త్రీలను సాధారణ కాన్పుల కోసం ప్రోత్సహించాలని, అందుబాటులో ఉండి సాధారణ కాపులయ్యేలా చూడాలని సూచించారు.అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ ద్వారా సెలవు మంజూరు చేస్తామని, మీకు ఏమైనా సెలవులు అవసరం ఉంటే ముందుగా వైద్యాధికారి ద్వారా అనుమతి తీసుకోవాలని అన్నారు. ఉపయోగించికోవాల్సిందిగా కోరారు. అనంతరం మునగాల, రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునగాల మెడికల్ ఆఫీసర్ రవీందర్, రేపాల మెడికల్ ఆఫీసర్ వినయ్ కుమార్,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జయ మనోహరి, మునగాల, రేపాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.