ఫిబ్రవరి 15 న హైదరాబాద్ లోని శ్రీ సేవాలాల్ మహారాజ్ భవన్ లో నిర్వహించే సేవాలాల్ మహారాజ్ 286 జయంతినీ విజయవంతం చేయాలని ఎల్ హెచ్ పి వి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ పిలుపునిచ్చారు. నల్లగొండ లోని అంబేడ్కర్ భవన్ లో గురువారం మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ట్రైకార్ ఛైర్మన్, ఎల్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ హాజరవుతారన్నారు.