వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగియగా. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23 అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసి 22 మంది బరిలో నిలిచారు.