Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ : కాకినాడ కార్పోరేషన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలని, అక్రమ కరెంటు సరఫరా వలన లక్షల్లో భారంగా పెరుగుతున్న బిల్లుల చెల్లింపులను దర్యాప్తు చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. శ్రీవిద్యా కాలనీలో పదేళ్ల క్రిందట నగర పాలక సంస్థ నిధులు రూ.50లక్షలు వెచ్చించి నిర్మించిన రెండు సింథటిక్ టెన్నిస్ కోర్టులను టెండర్ల నిర్వహణ ద్వారా అజమాయిషీ చేయకుండా పరపతి కలిగిన వ్యక్తుల చేతుల్లోకి వదిలి వేయడం వలన కార్పోరేషన్ ఖజానాకు తీవ్ర నష్టం, ఇష్టారాజ్యంగా కోర్టు ప్రాంగణాలు గదులను స్వంతానికి వాడుకుంటున్న ధోరణి కరెంటు చార్జీలు చెల్లించాల్సిన పద్ధతిలో ఉచితంగా అప్పగించినప్పటికీ భారీవిద్యుత్ చార్జీలు నగర పాలక సంస్థ భరించడం విడ్డూరంగా ఉందన్నారు. నెలవారీ వసూళ్లతో నిర్వహణ చేస్తున్న ప్రయివేటు వ్యవహారంపై నిర్ధిష్ట విధానాలు మున్సిపల్ చట్టం ప్రకారం చేపట్టాల్సిన నిర్ణయాలు లేవన్నారు. కొందరి వ్యాపార ఆదాయం కోసం వదిలివేసిన తీరు తగదన్నారు. క్రీడాకారులు బట్టలు మార్చుకునే గదిని నివాస గృహం చేయడం వలన సౌకర్యాలు కరువయ్యాయన్నారు.మూడేళ్ల క్రితం టెండర్ల నిర్వహణకు పిలుపునిచ్చినా కార్యరూపం దాల్చలేదన్నారు. అనధికారికంగా క్యాంటీన్ నిర్వహణ వీటన్నిటికీ యధేచ్చగా కార్పోరేషన్ స్ట్రీట్ లైట్ కరెంటును ఫ్రీగా దుబారాగా వినియోగించడం వలన కార్పోరేషన్ ఖజానా నాశనం అవుతున్నదన్నారు. క్రీడల తర్ఫీదు కూడా సక్రమంగా లేక తల్లిదండ్రులు కలత చేందుతున్నారాన్నారు. ఇదే రీతిగా నగరంలో పలు చోట్ల కార్పోరేషన్ కరెంటు ప్రయివేటు వ్యవహారాల వ్యాపారాలకు, ఎండోమెంట్స్ ఆలయాల ఉత్సవాలకు మున్సిపల్ చట్ట విరుద్ధంగా వినియోగం జరుగుతున్నదన్నారు. పార్కుల్లో క్రీడా మైదానాలు, షటిల్ కోర్టులు, బ్యాడ్ మింటన్ కోర్టులు ఉండకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలు వున్నప్పటికీ కాకినాడ నగరంలో ప్రతి పార్కు ఆక్రమణలకు తీవ్రంగా గురయ్యి ప్రయివేటు వ్యక్తులకు అనధికార ఆదాయం కల్పించి కార్పోరేషన్ కు లక్షల్లో నష్టం చూపిస్తున్నారన్నారు. సుప్రీం ఆదేశాలు అమలుచేసి పార్కుల్లో క్రీడల కోర్టులు తొలగించాలన్నారు. క్రీడలకు ప్రత్యేక మైదానాలు నెలకొల్పాలన్నారు. శ్రీవిద్యా కాలనీ స్కేటింగ్ కోర్టులకు కుళాయి చెరువు ఆవరణలోని వై.ఎస్.ఆర్.స్కేటింగ్ సెంటర్ తరహాలో టెండర్లు పిలిస్తే వచ్చే నష్టం ఏమిటని అధికారులను సూటిగా ప్రశ్నించారు. తెలుపు రేషన్ కార్డు కలిగిన పిల్లలకు ఉచితంగా స్కేటింగ్ వంటి క్రీడల శిక్షణ ఇవ్వాల్సిన బీరక చంద్రశేఖర్ హయాంలోని కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సగిలి షన్ మోహన్, మున్సిపల్ కమీషనర్ హెచ్.భావన ప్రత్యేక దర్యాప్తుతో నివేదిక చేపట్ట, తక్షణమే టెండర్ల నిర్వహణ చేయించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. గతం నుండి ఇప్పటి వరకు కార్పోరేషన్ నుండి చెల్లించిన కరెంటు చార్జీల మొత్తాన్ని బాధ్యుల నుండి సంభంధిత ఇంజనీరింగ్ అధికారుల నుండి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేషన్ ఆదాయం పెంపు చేసే చర్యలకు పూనుకోవాలన్నారు.

Related posts

ప్రభుత్వాసుపత్రిని కాకినాడ జిల్లాకు పరిమితం చేయాలి

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

విద్యుత్ టారిఫ్ బాదుడు వలన ధరలు మరింత పెరుగుతాయి

Dr Suneelkumar Yandra

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

Dr Suneelkumar Yandra

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

Dr Suneelkumar Yandra

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

TNR NEWS