Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

పిఠాపురం : మహాశిరాత్రికి పాదగయ క్షేత్రంలో ఏర్పాట్లు అన్ని సిధ్ధం అయ్యాయని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామి ఆలయ సహాయ కమీషనర్‌ మరియు కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సంధర్భంగా బుధవారం సాయంత్రం ఆయన ఆలయ ఆవరణలో పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు మహాశిరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. మహాశివరాత్రికి పాదగయాక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంన్నామని, చంటి పిల్లలకు క్యూలైన్లలో పాలు, మంచినీరు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 24వ తేదీ సోమవారం స్వామివారి కళ్యాణం, 25వ తేదీ మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకములు మరియు గ్రామోత్సవం, 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి, 27వ తేదీ గురువారం రథోత్సవం, 28వ తేదీ శుక్రవారం త్రిశూల స్నానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

Dr Suneelkumar Yandra

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు

ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Dr Suneelkumar Yandra

నిరక్షరాస్యత నిర్మూలన పై ప్రత్యేక శ్రద్ధ

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra