హైదరాబాద్ : రుద్ర పీపుల్స్ పవర్ పొలిటికల్ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం లభించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోద పత్రంని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఆశోక్ కుమార్ చేతుల మీదుగా పార్టీ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు అందుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో అందరూ సమానమే, అందరికి సమ న్యాయం, సమాన హక్కులు అనే సిద్ధాంతంతో పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఇప్పటికి పార్టీలో 10 వేలమందికి పైగా జాయిన్ అయ్యారు అని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చిన, ఏ కష్టం వచ్చినా తమ పార్టీ ముందు ఉంటుందని అన్ని రకాల సేవలు చేయాలని పార్టీ స్థాపించారని పార్టీ అధ్యక్షుడు తెలిపారు. ఎవ్వరైనా పార్టీలో జాయిన్ అవ్వొచ్చని, యువతకి, మహిళలకు, ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. స్టేట్ లీడర్స్ ని, అన్ని జిల్లాలకు లీడర్లుని, గ్రామాలకి లీడర్స్ ని నియమిస్తున్నారని, లీడర్స్ గా ఎదగాలి అనుకునే వారికి తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. మార్చి 30వ తేదీన ఉగాదికి పార్టీని అతిరథమహారధులు చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందన్నారు. జాయిన్ అవ్వాలనుకునే వారు 7386178182 నెంబర్ ని సంప్రదించండి లేదా మెసేజ్ చేయాలని కోరారు.

previous post
next post