Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

కాకనందివాడ గ్రామ దేవత కాకినాడ నూకాలమ్మ

మార్చి2 నుండి 30 వరకు కొత్త అమావాస్య జాతర సందర్భంగా ప్రత్యేకం

 

కాకినాడ : కాకినాడ అంటే ఒకప్పుడు కాకనంది వాడ వంశీయులు పాలించిన నేల. కెనడా నగరాన్ని పొలివుందని అప్పటి ఫ్రెంచ్ పాలకులు కో-కెనడాగా పిలుచుకున్నారు. నోరు తిరగక కోకనాడ అన్నారు. అంటే ఇంగ్లీష్ లో సి వో అంటే కో.. కెనడా అంటే సి ఇ ఎన్ ఎ డి ఎ అంటే కనడా అని కూడా పలుకుతుంది. ఆ రకంగా కోకనాడ అని ఇంగ్లీష్ తిరగని తెలుగులో ఖూనీ చేసారు. అదేదో గొప్ప అన్నట్టుగా రైలుకు కూడా కొకనాడ ఎక్స్ ప్రెస్ అని ఇక్కడి స్థానికులు కాని స్థానికులు కేంద్ర రైల్వేలో ముదనష్టంగా నామకరణం చేయించారు. ఈ కథ ఇలా వుంటే కాకనందివాడ వంశీయులు ఏటా వన దేవత పూజకు వచ్చేవారు. ఆ ప్రదేశం ఇప్పటి కుళాయి చెరువు పార్కు ప్రాంగణం. అప్పటిలో ఇదంతా అడవి. ఆ ప్రదేశంలో వారి ఇంటి ఆడపడుచు కాకనంది వాడ వంశ ప్రతీకగా ధరించే ముక్కెర కోల్పోయింది. అప్పటి నుండే ఆ వంశం అంతరించిపోయింది. కాలక్రమంలో పట్టణంగా ఏర్పడింది. విక్టోరియా మహారాణి త్రవ్వించిన వాటర్ వర్క్స్ ప్రాంగణంలో చెరువు త్రవ్వకాల యందు ముక్కెర లభించింది. అమ్మ వారి ఆనవాలుగా భావించి అక్కడి కూడలిలో కూలీలు అంతా కలిసి పిఠాపురం రాజా దృష్టికి తీసుకు వెళ్లారు. వారి ఆసక్తి మేరకు అక్కడి స్థలాన్ని ఆలయానికి ఇచ్చారు. కానీ గ్రామదేవత అమ్మగా ఆమెకు ఎదురుగా ఏ అడ్డూ వుండకూడదని రోడ్డు మార్గంలోనే భూగర్భం చేసి నూకాలమ్మ కోవెల ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అక్కడి ఏరియాలో అన్ని కులాల జాతుల వారు అమ్మవారికి వారి వారి ఇండ్లల్లో ఏడాదికి ఒకసారి వచ్చే పెద్ద అమావాస్య నెల రోజుల్లో పాన్పు ఏర్పాటు చేసే ఆచారం చేపట్టి గరగలు త్రిప్పించారు. అదే వేడుకగా నూకాలమ్మ వర్ధిల్లింది. కాలక్రమంలో జాతర వేలం పాటలు వచ్చాయి. భక్తులకు శఠగోపం పేరిట వార్తలు వెలుగు చూసాయి. శ్రీగణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో టు టౌన్ ఫ్రెండ్స్ సర్కిల్ వేలం పాటల వలన కలుగుతున్న భక్తుల పై పడుతున్న భారాలు గురించి ఉద్యమం చేసింది. దేవాదాయ శాఖ పరిధిలోకి 1996లో చేరింది. కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణ ఏర్పడింది. మరల రెండు దశాబ్దాల కాలం నుండి రాజకీయ క్రీ నీడలో అధిక ధరల భారం వుంటున్న దుస్థితి నెలకొంది. ఈ విషయాలు ఎలావున్నా నూకాలమ్మ తల్లి అంటే కాకినాడ ప్రసిద్ధి. కాకినాడ వాసులు ఏ దేశంలో వున్నా, ఏ రాష్ట్రంలో వున్నా, ఏ జిల్లాలో వున్నా ఏడాదికి ఒకసారి నూకాలమ్మను దర్శించడం ఆనవాయితీ. రావడానికి వీలు కుదరక పోతే వారి కుటుంబం ద్వారా నూకాలమ్మకు చలివిడి సారె అప్పజెప్పడం చేయకుండా ఏ శుభకార్యం చేపట్టారు. ఊరు నుండి ఏ ప్రయాణం చేసినా ఏ ప్రయాణం చేసి ఊరికి వచ్చినా కొత్త పేట నూకాలమ్మను దర్శించకుండా ఇండ్లకు వెళ్లరు. ఇది ఇక్కడి శాసనం. టౌన్ రైల్వే స్టేషన్ కు అతి దగ్గరగా బస్ కాంప్లెక్స్ కు సమీపంగా వున్న నూకాలమ్మ ఆలయం కాకినాడ స్మార్ట్ సిటీకి సెంటర్ లో వుంది. ఆమె ముక్కర లభించిన ప్రాంగణం ఇప్పుడు స్వామివివేకానంద పార్కుగా అవతరించింది. నూకాలమ్మ గ్రామదేవతకు ఏమి చేసామన్నది ముఖ్యం కాదు. ఆమె దర్శనానికి ఆర్థిక షరతులు లేకుండా భాగ్యం కల్పించడమే పరమావధిగా వున్నంత కాలం ఇక్కడి కుటుంబాలు సముద్ర తీరానికి చేరువలో వున్నా ఎటువంటి సునామీకి గురవ్వరు అనేది 2007 వచ్చిన సునామీ ద్వారా అవగతం అయ్యింది. ఆనాటి సునామీ అల ఒక్క సెకను అధికంగా వున్నా కాకినాడ కనుమరుగు అయ్యేది. ఇప్పటికీ కాకినాడ సురక్షితంగా వుందంటే కారణం తీరంలో వున్న ఆదికుంబేశ్వర స్వామి అనుగ్రహం. నూకాలమ్మ తల్లి దర్శనం భక్తులకు వరంగా వున్నంత కాలం ఆమె దయ వుంటే అన్నీ వున్నట్లే అని భావిస్తారు ఆధ్యాత్మిక విశ్లేషకులు. గ్రామదేవత పూజారిగా బడే కుటుంబం అంకితమయ్యింది. ఆ ఇంటి ఆడపడుచులకు నూకాలమ్మ సేవగా ఇంటికి పిలిచి సారె ఇవ్వడం వలన తమ ఇంటి ఆడపడుచులు కడుపులు చల్లగా వుంటాయని విశ్వసిస్తారు.

 

దూసర్లపూడి రమణరాజు

భోగిగణపతి (స్వయంభు) పీఠం ఉపాసకులు కాకినాడ.

 

 

 

Related posts

నేల తల్లిని విస్మరిస్తే ప్రమాదాలు తప్పవు

TNR NEWS

విస్తరాకు ….. మనిషి జీవితం

TNR NEWS

టోక్యో (జపాన్)లో . పర్యటించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.

TNR NEWS

రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* **రాఘవపూర్ -కన్నాల వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*  *ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

TNR NEWS

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

పిఠాపురం

Dr Suneelkumar Yandra