పిఠాపురం : స్థానిక సీతయ్యగారితోటలో గల ఆదిత్య పాఠశాలలో కన్నుల పండుగగా ఐఎన్ఎస్పిఐఆర్ఏ (ఇన్స్పిరా) – 2025 అకాడమిక్ ఉత్సవాలు నిర్వహించారు. తెలుగు నుండి సోషల్ వరకు అన్నీ సబ్జెక్టుల వారీగా వినూత్న అంశాలను విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి చక్కగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్.శ్రీనివాస్ వినీల్ (డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్) సి.వి.రామన్ చిత్రపటానికి పూల మాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు వారిలో దాగియున్న ప్రతిభను వెలికి తీయుటకు ఒక్క సైన్స్కు పరిమితం కాకుండా అన్ని సబ్జెక్టులకు అవకాశం ఇన్ని విద్యార్థులను ప్రోత్సహించు విధానం తమకెంతో నచ్చిందని శ్రీనివాస్ వినీల్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 700 మంది విద్యార్థులు 264 ప్రాజెక్టులలో పాల్గొన్నారని ఆదిత్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.విజయసారథి చెప్పారు. ఈ ప్రాజెక్టులలోని అంశాలు తల్లిదండ్రులను, వివిధ పాఠశాల విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి అని ఇన్చార్జ్ శ్రీనివాస్ తెలియజేశారు. తెలుగు ప్రాజెక్టులో పిఠాపురం ఆధ్యాత్మికత, మన సంస్కృతి సంప్రదాయాలు, వివిధ జానపదకళలు, అష్టావధానం, మన ఇతిహాసాలు, ఛందస్సు – పద్యరచన, అనే అంశాలలో ఉన్న విద్యార్థులను ప్రశంసలు కురిపించారు. కుల వృత్తులు, సాహిత్య సమ్మాన్, హిందీ భాష చరిత్ర, హిందీ వ్యాకరణ అనే అంశాలు విద్యార్థులు హిందీ భాషలో చక్కగా బోధించి పలువురిని ఆకట్టుకున్నారు. ఫిజిక్స్ ప్రాజెక్టులు, సురక్ష, జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, ఫ్రేమ్ వేస్ లేబర్ సెక్యూరిటి అలారమ్, హైడ్రాలిక్ మేషీన్లు, వీక్షకులకు కనువిందు చేయడంతో పాటు, విద్యార్థుల బోధన వారిని ఎంతో ఆకట్టుకుంది. బయాలజిలో బ్రాంచెస్ ఆఫ్ మెడిసన్ గురించి విద్యార్థులు వివరించే విధానం అందరిని ఆకట్టుకొనే విధంగా ఉంది. అగ్రికల్చర్లో హైడ్రోపోనిక్, బ్లడ్ గ్రూప్, షుగర్ టెస్ట్ బి.పి టెస్టులు అన్నీ విద్యార్థులచే నిర్వహించబడ్డాయి. సోషల్ ప్రాజెక్టులలో విద్యార్థులు ప్రతి తరగతి గదిని ఒక దేశంగా తీసుకొని ఆ దేశం యొక్క నైసర్గిక, భౌగోళిక, రాజకీయ, అంశాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి చిందాడ చిన్నోడు, తిరగటి గణేష్, అల్లంరాజు మూర్తి, కొవ్వాడ ఫణికుమార్, వీరమళ్ళ లక్ష్మినారాయణ కుమారి, మహ్మద్ జిలానీ భాషా, పంతుల సూర్యాకుమారి జడ్జిలుగా వ్యవహరించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రధానం చేసారు.