Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

కోదాడ పట్టణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్డులో గల గ్రౌండ్లో కోదాడ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు.నేటి యువత చదువుతోపాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడాకారులకు క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మొదటి బహుమతి దాత రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, కర్ల సుందర్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు పంది తిరపయ్య, షేక్ మస్తాన్ నిర్వాహకులు లాజర్,భరత్, కోటేష్, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

జుక్కల్ లో వివాహిత అదృశ్యం 

TNR NEWS

ఈనెల 20న వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన

TNR NEWS

పొలంలో ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై

TNR NEWS

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

TNR NEWS

ఈనెల 24న పురగిరి క్షత్రియ పెరిక కార్తిక మాస వనభోజనాలు

Harish Hs