ఎస్సీ వర్గీకరణతో దళితులందరికీ రాజ్యాంగ ఫలాలు దక్కుతున్నాయని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షులు చింతా బాబు మాదిగ అన్నారు. సోమవారం ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని గాంధీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగానే 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న వర్గీకరణ సాధ్యమైనదని అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్ జెండా తోనే మాదిగలకు అన్ని రంగాల్లో గౌరవం, సమచిత స్థానం దక్కిందని మాదిగ దండోరా చేసిన ఉద్యమాల ఫలితంగానే నేడు ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంపాటి శ్రీను, గంధం యాదగిరి, చీమ శ్రీను, నెమ్మది సురేష్, పల్లెటి లక్ష్మణ్, బాణాల అబ్రహం, ఏర్పుల చిన్ని, కందుకూరి నాగేశ్వరరావు, నారకట్ల ప్రసాద్, బొల్లెపోగు స్వామి, పిడమర్తి బాబురావు, సోమపొంగు శ్రీను, కాసర్ల రాజు, ఇటికల మధు, జగదీష్, చింతా వినయ్, రాఖీ, వంశీ,విక్రమ్, రాహుల్,రాజేష్, గోపి తదితరులు పాల్గొన్నారు…..