హైదరాబాద్ : బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు నవంబర్ లో నిర్వహించబోయే “బుస్సా విజేత అవార్డ్స్”కు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు. వారిలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థకు చెందిన సమాచార్ భవన్ లో సంస్థ మనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక, సంస్థ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ కిషోర్ బాబు, తెలుగు టెలివిజన్ వర్కర్స్, టెక్నీషియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్, టివి మరియు సినీ నటీనటులు అశోక్ కుమార్, జె.యల్.శ్రీనివాస్, లహరి, మధు ప్రియ, మాణిక్, నటి సూర్యకళ, దర్శకులు-రచయిత సంఘం అధ్యక్షుడు ప్రేంరాజ్, నరేంద్ర, తెలుగు తెలంగాణా సినీ టివి నటినటుల సంఘం అధ్యక్షుడు రాజ్ శేఖర్, గోపాల కృష్ణ, యం.ఎస్.ప్రసాద్, చిత్తరంజన్ దాస్, సినీ, టివి గేయ రచయిత వెనిగళ్ళ రాంబాబు, సత్యం యాబి మాస్టారు, అక్కినేని శ్రీధర్ లక్ష్మి, డాక్టర్ శ్రీరాందత్తి, శ్రీరామోజు లక్ష్మి నారాయణ, భాస్కర్ల వాసు, నరేందర్ రెడ్డి, ఆర్.డి.ఎస్.ప్రకాష్ మరి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక ఛైర్మన్ & ఎడిటర్ బుస్సా బాలరాజు మాట్లాడుతూ సినిమా, షార్ట్ ఫిల్మ్, ఫోక్ సాంగ్, వ్యాపారం, రాజకీయం, ఆరోగ్యం, కళారంగం, సేవా రంగం, విద్య, ఉపాధ్యాయ, పత్రికా, పలు రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న ప్రతీ ఒక్కరినీ బుస్సా విజేత అవార్డ్స్ తో ఘనంగా సత్కరిచరిచడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే అవార్డ్స్ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తానని, మరిన్ని వివరాలకు 9908780059 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.
previous post
